విధి వంచితులు | Mother died with unhealthy | Sakshi
Sakshi News home page

విధి వంచితులు

Aug 26 2016 1:50 AM | Updated on Sep 28 2018 3:41 PM

విధి వంచితులు - Sakshi

విధి వంచితులు

ఆలనాపాలన చూడాల్సిన తండ్రి పదేళ్ల క్రితమే తనువుచాలించాడు.. కాయకష్టం చేసి బిడ్డలకు అండగా ఉన్న తల్లి కూడా అనారోగ్యంతో మత్యుఒడికి చేరింది.

– అనారోగ్యంతో తల్లి మత్యువాత
– పదేళ్ల క్రితమే తండ్రి
– అనాథలైన ఇద్దరు బాలికలు
గుండ్రాంపల్లి(చిట్యాల)
ఆలనాపాలన చూడాల్సిన తండ్రి పదేళ్ల క్రితమే తనువుచాలించాడు.. కాయకష్టం చేసి బిడ్డలకు అండగా ఉన్న తల్లి కూడా అనారోగ్యంతో మత్యుఒడికి చేరింది. నా అనేవారు లేక ఇద్దరు బాలికలు విధి వంచితులయ్యారు. ఈ విషాదకర ఘటన చిట్యాల మండలం గుండ్రాపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదిరి లింగస్వామి, యాదమ్మ దంపతులకు ఇద్దరు బాలికలు విజయ, తులసి.పదేళ్ల క్రితం భర్త లింగస్వామి మతిచెందాడు. దీంతో యాదమ్మ కూలిపనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఆమె కూడా అనారోగ్యంతో  గురువారం మతిచెందింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు విజయ, తులసిలు అనాథలయ్యారు.  పెద్దకూతురు విజయ తల్లి యాదమ్మకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. అనాథలుగా మారిన బాలికలను ప్రభుత్వం అదుకోవాలని ఆ గ్రామ ఎంపీటీసీ బండ గిరిజ, అంజయ్య కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement