‘మిడ్‌మానేర్‌’ నిర్వాసితులకు పరిహారం | Sakshi
Sakshi News home page

‘మిడ్‌మానేర్‌’ నిర్వాసితులకు పరిహారం

Published Fri, Feb 10 2017 10:44 PM

‘మిడ్‌మానేర్‌’ నిర్వాసితులకు పరిహారం - Sakshi

18 ఏళ్లు నిండితే రూ.2లక్షల చొప్పున పరిహారం
► 4,720 మంది యువతకు లబ్ధి
► వెల్లడించిన టెస్కాబ్‌ చైర్మన్  కొండూరి


ముస్తాబాద్‌ (సిరిసిల్ల) : మిడ్‌మానేర్‌ నిర్వాసితులకు కుటుంబ ప్రయోజన పరిహారం మంజూరైనట్లు టెస్కాబ్‌ చైర్మన్  కొండూరు రవీందర్‌రావు వెల్లడించారు. మండలకేంద్రంలో గురువారం విలేకరులతోమాట్లాడారు. నిర్వాసితుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్‌.. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. 2006 నుంచి 2015 వరకుæ 18 ఏళ్లు నిండినవారికి రూ.2లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని, ఈ నిర్ణయంతో 4,720 మందికి పరిహారం అందుతుందని చెప్పారు. ఇళ్లకు పరిహారం తీసుకోని 197 మందికి వడ్డీ చెల్లించేందుకూ సీఎం అంగీకరించి జీవో 66 విడుదల చేశారని వివరించారు.

2013లో కొందరు నిర్వాసితులు ఇళ్ల పరిహారం తీసుకోలేదని, ఆ మొత్తాన్ని అధికారులు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారని, పరిహారానికి నిర్వాసితులు పదిశాతం వడ్డీ కోరితే.. సీఎం 15శాతం చెల్లించేలా జీవో తెచ్చారని వెల్లడించారు. మధ్యమానేరులో జూలై నాటికి ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశముందన్నారు. నిర్వాసితు లు వారికి కేటాయించిన పునరావాస కాలనీలకు వెళ్లాలని కోరారు. సర్పంచ్‌ నల్ల నర్సయ్య, సహాకార సంఘాల చైర్మన్లు చక్రాధర్‌రెడ్డి, తన్నీరు బాపురావు, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, మాజీ ఎంపీపీ గోపాల్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, కొండ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

దిగువ భూములకు ఎగువమానీరు  
ఎగువ మానేర్‌ నీటిని చివరి ఆయకట్టు వరకు అందిస్తామని టెస్కాబ్‌ చైర్మన్  కొండూరు రవీందర్‌రావు అన్నారు. ఎగువ మానేరు ఆయకట్టుకు నీరు అందడం లేదని స్థానికులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. రవీందర్‌రావు గురువారం కాలువలు, పంట పొలాలను పరిశీలించారు. ఎగువన ఉన్న రైతులు కాలువలకు గండ్లు కొట్టి దిగువ రైతులకు నష్టం చేయవద్దన్నారు. జెడ్పీకో–ఆప్షన్  సభ్యుడు సర్వర్, రైతులు గండ్లను పూడ్చివేసి రైతులందరికి నీటి సరఫరా చేయడం అభినందనీయమన్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో 17 మంది గ్యాంగ్‌మన్లను నియమిస్తున్నారన్నారు.

ముస్తాబాద్‌లో సెంట్రల్‌ లైటింగ్, రోడ్ల విస్తరణకు రూ.12 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో విస్తరణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ శరత్‌రావు, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీకోఆప్న్ సభ్యడు సర్వర్, సెస్‌ డైరెక్టర్‌ విజయరామారావు, విండో చైర్మన్లు చక్రాధర్‌రెడ్డి, తన్నీరు బాపురావు, సర్పంచ్‌ నల్ల నర్సయ్య, గోపాల్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, కొమ్ము బాలయ్య, కొండ శ్రీనివాస్‌ తదితరులున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement