శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి | manoj sinha visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి

Jul 31 2016 8:28 AM | Updated on Sep 4 2017 7:13 AM

తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా దర్శించుకున్నారు.

తిరుమల : తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం వద్ద టీటీడీ అధికారులు మంత్రి మనోజ్ సిన్హాకు స్వాగతం పలికారు.శ్రీ వారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను మనోజ్ సిన్హాకు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement