ఆర్.మరువపల్లి గ్రామంలో కొత్తకోట కురుబ రామన్న (58)అనే వ్యక్తి డెంగీ లక్షణాలతో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రొద్దం : ఆర్.మరువపల్లి గ్రామంలో కొత్తకోట కురుబ రామన్న (58)అనే వ్యక్తి డెంగీ లక్షణాలతో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజులుగా తీవ్రజ్వరంతో బాధపడుతున్నాడని, రెండు రోజుల క్రితం హిందూపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని తెలియజేశారు.
డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని, బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించడంతో ఆదివారం ఉదయం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు వివరించారు. మృతుడికి భార్య చెన్నమ్మ,, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే బీకే పార్థసారథి, జెడ్పీటీసీ సభ్యుడు చిన్నప్పయ్య మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.