మహా స్థూపానికి మహాయజ్ఞం | maha stupaniki mahayagnam | Sakshi
Sakshi News home page

మహా స్థూపానికి మహాయజ్ఞం

May 26 2017 12:34 AM | Updated on Sep 5 2017 11:59 AM

మహా స్థూపానికి మహాయజ్ఞం

మహా స్థూపానికి మహాయజ్ఞం

ఆకివీడు: సాయికోటి నామ లిఖిత మహాయజ్ఞం గురువారం స్థానిక సాయినగర్‌లోని సాయి మందిరంలో వైభవంగా సాగింది.

ఆకివీడు: సాయికోటి నామ లిఖిత మహాయజ్ఞం గురువారం స్థానిక సాయినగర్‌లోని సాయి మందిరంలో వైభవంగా సాగింది. వంద అడుగుల ఎత్తుగల సాయికోటి మహాసూ్థపం దశమి వార్షికోత్సవం సందర్భంగా సాయికోటి నామలిఖిత మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయికోటి పుస్తకాల్ని నిక్షిప్తం చేశారు. వేలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవిత్రాత్మ స్వరూప సాయి గురు కొపల్లె సూర్యనారాయణ మాట్లాడుతూ సాయిబాబా గురువే కాదు దైవం అన్నారు.  ఎంతో మందికి నిజరూపంగా సాయి మహిమల్ని అందించారని చెప్పారు. సుప్రభాత సేవ, నాలుగు హారతులను సాయికి అందజేశారు. ఆలయం వద్ద శాంతి పూజలు, పవిత్రోత్సవ పూజలు నిర్వహించారు. అనంతరం పవళింపు సేవ జరిగింది. అఖండ అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement