గ్యాస్‌ సిలిండర్లు పేలి లారీ దగ్ధం | Lorry with cylinders hits tree, engulfed in fire | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్లు పేలి లారీ దగ్ధం

Mar 9 2017 6:37 AM | Updated on Apr 3 2019 7:53 PM

జిల్లాలోని ఆనందపురం మండలం గుడిలోవ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

విశాఖపట్టణం: జిల్లాలోని ఆనందపురం మండలం గుడిలోవ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో కొన్ని సిలిండర్లు పేలాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో అక్కడికి చేరుకున్న జనం.. ఫైరింజన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్ధలికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సిలిండర్లు పేలడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement