రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలైన సంఘటన విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం పిసినకాడ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
లారీ-బస్సు ఢీ, 15 మందికి గాయాలు
Mar 19 2017 9:42 AM | Updated on Apr 3 2019 7:53 PM
విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలైన సంఘటన విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం పిసినకాడ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.
Advertisement
Advertisement