ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్ స్ఫూర్తితో... | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్ స్ఫూర్తితో...

Published Tue, Sep 1 2015 12:30 PM

ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్ స్ఫూర్తితో...

మేనమామ స్ఫూర్తితో నటనవైపు అడుగులు
ఉన్నత చదువు చదివినా యాక్షన్‌పైనే ఆసక్తి
వెండితెర, బుల్లితెరలపై రాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా యువకుడు
 
నటుడిగా రాణించి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నది ఆ యువకుడి జీవితాశయం. నటన పట్ల అంతులేని ఆసక్తితో ఉన్నత చదువు చదివినా నటననే వృత్తిగాను, ప్రవృత్తిగాను  ఎంచుకున్నాడు. ఉద్యోగం, ఉపాధి వంటి అవకాశాలు  వచ్చినా ఇష్టపడ్డ రంగాన్ని ఎంచుకుంటే జీవితంలో రాణించవచ్చన్నది అతని భావన. అందుకే వెండితెర, బుల్లితెరలపై తన ట్యాలెంట్ నిరూపించుకుని ఓ వెలుగు వెలగాలనే ధ్యేయంతో ఉన్నాడు కూన వేణుగోపాల్ అనే  ఈ యువ నటుడు.  
 
శ్రీకాకుళం: సినీ, టీవీ రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్న కూన వేణుగోపాల్ స్వగ్రామం పోలాకి మండలం నర్సాపురం. విద్యాభ్యాసం అంతా ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటలోనే సాగింది. నాటక రంగ దిగ్గజం మెట్ట అప్పారావు నాయుడు ఇతని మేనమామ. మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటూ, ఆయన స్ఫూర్తితోనే నటన రంగంలోకి అడుగు పెట్టాడు. బి.ఫార్మశీ చదివిన ఈ యువకుడు సిక్కింలోని మణిపాల్ యూనివర్శిటీలో పీజీ మాస్ కమ్యూనికేషన్స్ చేశారు.
 
ఎఫ్‌ఎం రేడియోలో ప్రవేశం
నటనపై ఆసక్తితో ముందుగా హైదరాబాద్‌లో 2009లో ఎఫ్‌ఎం రేడియో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అక్కడి నుంచి దొరికిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకునే పనిలో పడాడు. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున,సమంత, తమన్నా వంటి వారి ఇంటర్వ్యూలను మాటీవీ కోసం చేశారు. మాటీవీ యాంకర్‌గా సైతం కొంతకాలం పని చేశారు. సమ్‌థింగ్ స్పెషల్ కార్యక్రమం యాంకర్‌గా అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
 
ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్ స్ఫూర్తితో..
జాతీయస్థాయి ఉత్తమనటులు ప్రకాశ్‌రాజ్,నానాపటేకర్‌లను స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగుతున్న వేణు ప్రస్తుతం టీవీ, సినీ రంగంలో అవకాశాలు రావటం అంత తేలిక కాదు అని, అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగటం మంచిదని భావిస్తున్నారు. బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. బంగారుకోడిపెట్ట, వెయ్యి అబ ద్ధాలు, జైశ్రీరాం,సరదాగాఅమ్మాయిలతో.. వంటి సినిమాల్లో నటించాడు.  
 
అలామొదలైంది.. సీరియల్‌తో ప్రేక్షకులకు చేరువయ్యాడు. మరో పక్క జీటీవీలో ప్రసారం అయిన గంగతో రాంబాబు సీరియల్‌లో తాను నటించిన హాస్య న్యాయవాది పాత్రకు మంచి గర్తింపు తెచ్చుకున్నారు.అన్వేషిత సీరియల్‌లో నటన అతని నటన ఆకట్టుకుటుంది.సన్ నెట్‌వర్క్,రాడాన్ వంటి సంస్థ వంటివి తమిళ సీరియల్స్‌లో నటించేందుకు ఆఫర్లు కల్పిస్తున్నాయి. వ్యవసాయ వృత్తిని నమ్ముకున్న తండ్రి కృష్ణారావు, గృహిణి తల్లి విజయలక్ష్మి కూడా కుమారుడు ఆసక్తిని, అభిరుచిని ప్రోత్సహిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement