హనుమంత వాహనంపై ఖాద్రీశుడు | khadrishudu on hanumantha vahanam | Sakshi
Sakshi News home page

హనుమంత వాహనంపై ఖాద్రీశుడు

Mar 11 2017 11:28 PM | Updated on Sep 5 2017 5:49 AM

హనుమంత వాహనంపై ఖాద్రీశుడు

హనుమంత వాహనంపై ఖాద్రీశుడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి  ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ  భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహావతారంలో హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం  మహావిష్ణువును సాక్షాత్తు హనుమంతుడే దిగివచ్చి తన భుజస్కందాలపై మోస్తాడని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విల్లంబులు ధరించి హనుమంతుని భుజాలపై కొలువుదీరిన శ్రీవారిని చూడడానికి రెండు కల్లు చాలవు.  . త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుని వాహనంగా చేసుకొని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి వివరిస్తూ రాముడు, కృష్ణుడు, నారసింహుడు అన్నీ తానేనని స్వామివారు తెలియజేస్తారని అర్చకులు వివరించారు.

తిరువీధుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి ఆలయానికి రాలేని వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు దర్శన మిచ్చేందుకు శ్రీవారే తన భక్తుల చెంతకు విచ్చేస్తారని తెలిపారు.   ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఉభయ దారులుగా మాజీ శాసనసభ్యుడు జొన్నా రామయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్‌ నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్‌ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి  తెలిపారు. కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement