ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘జబర్దస్త్’ కామెడీ షోలో గోదావరి జిల్లాల భాషను అధికంగా ప్రతిబింబించడం ద్వారానే మంచి గుర్తింపు లభించిందని నటుడు ఆచంట మహేష్ తెలిపారు. అంబాజీపేట మండలం కె.పెదపూడి చిరు పవన్ సేవా సమితి భవనంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ విలేకర్లతో కాసేపు ముచ్చటించారు. స్వగ్రామమైన మలికిపురం మండలం శంకరగుప్తంలో వంశీ దర్శకత్వంలో రూపొందించిన ‘మా పసర్లపూడి కథలు’లో తొలిసా
-
‘జబర్దస్త్’ మహేష్
కె.పెదపూడి (అంబాజీపేట) :
ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘జబర్దస్త్’ కామెడీ షోలో గోదావరి జిల్లాల భాషను అధికంగా ప్రతిబింబించడం ద్వారానే మంచి గుర్తింపు లభించిందని నటుడు ఆచంట మహేష్ తెలిపారు. అంబాజీపేట మండలం కె.పెదపూడి చిరు పవన్ సేవా సమితి భవనంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ విలేకర్లతో కాసేపు ముచ్చటించారు. స్వగ్రామమైన మలికిపురం మండలం శంకరగుప్తంలో వంశీ దర్శకత్వంలో రూపొందించిన ‘మా పసర్లపూడి కథలు’లో తొలిసారిగా అవకాశం లభించినట్లు తెలిపారు. రచయిత ప్రసన్నకుమార్ ద్వారా సినీ రంగంలోకి అరంగ్రేటం చేశానని, ఇప్పటి వరకూ 22 సినిమాల్లో నటించానని చెప్పారు. ‘సినిమా చూపిస్త మామా, లోఫర్, ఒక మనస్సు’ చిత్రాల ద్వారా గుర్తింపు లభించిదన్నారు. దిల్‌రాజ్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘శతమానం భవతి’, నానీ హీరోగా నిర్మిస్తున్న ‘నేను లోకల్’, రామ్ హీరోగా నటిస్తున్న ‘హైపర్’తో పాటు ‘నేను నా బాయ్‌ఫ్రెండ్’ సినిమాలో స్నేహితుల రోల్ చేస్తున్నట్లు వివరించారు. జబర్దస్‌్తలో ఇప్పటి వరకూ 55 ఎపిసోడ్‌లలో నటించానన్నారు.