
అంతర్జాతీయ హిందీ సదస్సులో ప్రసంగిస్తున్న నాంపల్లి మధుసూదనరావు
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 16, 17 తేదీల్లో మొదటి సారిగా జరిగిన అంతర్జాతీయ హిందీ సదస్సులో భద్రాచలానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు నాంపల్లి మధుసూదనరావు పాల్గొన్నారు.
భద్రాచలం : హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 16, 17 తేదీల్లో మొదటి సారిగా జరిగిన అంతర్జాతీయ హిందీ సదస్సులో భద్రాచలానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు నాంపల్లి మధుసూదనరావు పాల్గొన్నారు. ‘భారతీయ భాషాయే దశా దిశా’ అనే అంశం పై ప్రసంగించి పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రస్తుతం మణుగూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మన్యప్రాంతం నుంచి అంతర్జాతీయ హిందీ సదస్సుకు హాజరైన నాంపల్లిని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, పలువురు భాషా వేత్తలు అభినందించారు.