అంతర్ జిల్లా నేరస్తుడు అరెస్ట్
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుస చోరీల్లో ఆరితేరాడు.. గతంలో చేసిన నేరాలకు శిక్ష పడినా అతనిలో మార్పు రాలేదు.. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నెల రోజులకే వరుసగా మూడు చోరీలకు
తణుకు: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుస చోరీల్లో ఆరితేరాడు.. గతంలో చేసిన నేరాలకు శిక్ష పడినా అతనిలో మార్పు రాలేదు.. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నెల రోజులకే వరుసగా మూడు చోరీలకు పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున బంగారాన్ని కాజేశాడు. పాలకొల్లు బ్యాంకు కాలనీకు చెందిన ఉప్పు రాజేష్‌ను గురువారం తణుకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించా రు. అతని వద్ద నుంచి 24 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చింతా రాంబాబు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడిం చారు. తణుకు మండలం పైడిపర్రులో ఇటీవల జరిగిన చోరీపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తుల కదలికలపై దృష్టి సా రించారు. గురువారం తణుకు బస్టాండు ఎదురుగా ఒక టీ స్టాల్ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి సంచరిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోరీలకు శిక్ష అనుభవించి నెల రోజుల క్రితం బెయిల్‌పై వచ్చినట్టు తెలుసుకున్నారు. గత నెలలో పైడిపర్రులో ఒక ఇంటి తాళాలు పగులగొట్టి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు విచారణలో వెల్లడిం చాడు. దీంతోపాటు పూళ్ల, భీమడోలు ప్రాంతాల్లో సైతం ఇదే తరహాలో చోరీలకు పాల్పడినట్టు రాజేష్ నేరం అంగీకరించిట్టు సీఐ చెప్పారు. మూడు కేసులకు సంబంధించి అతని వద్ద నుంచి రూ.24 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులో చురుగ్గా పనిచేసిన తణుకు రూరల్, పట్టణ ఎస్సైలు సీహెచ్‌వీ రమేష్, డి.ఆదినారాయణతోపాటు వీరికి సహకరించిన హెడ్‌కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుళ్లు శివకుమార్, నాగేశ్వరరావు, వెలగేశ్వరరావును సీఐ అభినందించారు. వీరికి రివార్డు ఇప్పిం చేందుకు కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ను కోరనున్నట్టు సీఐ రాంబాబు వెల్లడించారు.