కూలిన ఇండోర్‌స్టేడియం | indoor stadium colapsed | Sakshi
Sakshi News home page

కూలిన ఇండోర్‌స్టేడియం

Jul 27 2016 1:00 AM | Updated on Sep 4 2017 6:24 AM

కూలిన  ఇండోర్‌స్టేడియం

కూలిన ఇండోర్‌స్టేడియం

నెల్లూరు(బృందావనం) : నెల్లూరులోని బారాషహీద్‌దర్గా ప్రాంగణానికి సమీపం లో ఉన్న జన్నత్‌ ఇండోర్‌ స్టేడి యం సోమవా రం రాత్రి కూలిపోయింది. రెవెన్యూ అధికారులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

  • రాత్రి పూట సంఘటన 
  • జరగడంతో తప్పిన ప్రమాదం
  • నెల్లూరు(బృందావనం) : నెల్లూరులోని బారాషహీద్‌దర్గా ప్రాంగణానికి సమీపం లో ఉన్న జన్నత్‌ ఇండోర్‌ స్టేడి యం సోమవా రం రాత్రి కూలిపోయింది. రెవెన్యూ అధికారులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితం కలెక్టర్‌గా పనిచేసిన జన్నత్‌హుస్సేన్‌ పేరుతో ఈ స్టేడియంను నిర్మించారు. వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులతోపాటు, నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బ్యాడ్మింటన్‌ ఆడేందుకు నిత్యం ఇక్కడకు వస్తారు. సోమవారం రాత్రి స్టేడియం ఒక్కపెట్టున కూలిపోయింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై నెల్లూరు ఆర్‌ఐ నాజర్‌ మాట్లాడుతూ ఎవరికీ ప్రమాదం జరగలేదని, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement