భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది.
ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి ఆదివారం 1,47,366 క్యూసెక్కుల వరదనీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 1,045 క్యూసెక్కులు, హంద్రీ నీవ్వా సుజల స్రవంతికి 1,014 క్యూసెక్కుల నీటిని రాయలసీమప్రాంత వాసుల అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. డిమాండ్‌ను అనుసరించి కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. సాయంత్రం 6గంటల సమయానికి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్‌తో ఉత్పత్తి చేస్తూ 6,357 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.