శ్రీశైలానికి పెరిగిన వరద | increase water flow to srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి పెరిగిన వరద

Aug 24 2016 12:37 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలానికి పెరిగిన వరద - Sakshi

శ్రీశైలానికి పెరిగిన వరద

శ్రీశైలం జలాశయానికి మంగళవారం వరద ప్రవాహం పెరిగింది. జూరాల నుంచి 16వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో మంగళవారం 24వేల క్యూసెక్కులకు చేరుకుంది.

 
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయానికి మంగళవారం వరద ప్రవాహం పెరిగింది. జూరాల నుంచి 16వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో మంగళవారం 24వేల క్యూసెక్కులకు చేరుకుంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 26,338 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. విద్యుత్‌ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 19,519 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రేగ్యులేటర్‌ ద్వారా 4,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 150.8076 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 872.10 అడుగులకు చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement