పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి | Improve self help groups | Sakshi
Sakshi News home page

పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

Sep 22 2016 9:20 PM | Updated on Sep 4 2017 2:32 PM

పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

మండల మహిళా పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని క్లస్టర్‌ ఏపీఎం మైసయ్య అన్నారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

మోతె: మండల మహిళా పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని క్లస్టర్‌ ఏపీఎం మైసయ్య అన్నారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు నెల సరి సంపాదించే డబ్బును పొదుపు చేసుకోవాలన్నారు. నెల నెల సంఘాలతో జరిగే సమావేశాలల్లో ఆర్థిక లావాదేవీలు బైలా ఆమోదం పొందాలన్నారు. అనంతరం మండల ఏపీఎం  వెంకయ్య మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘం నుంచి  నిల్వ చే సిన డబ్బుతో మహిళలు స్వయం ఉపాధికి ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.  సీసీలు ప్రతి గ్రామంలో నెలవారి మీటింగ్‌లు నిర్వహించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి లోన్లు అధికంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు కాంపాటి రాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీజీఎం మల్లేష్, సీసీలు నందు, సత్యం, శ్రీనివాస్, అకౌంటెంట్‌ వెంకటలక్ష్మి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ శేఖర్, ఆయా గ్రామాల మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement