విశాఖపట్నం జిల్లా దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయో మాక్స్ ప్లాంట్‌లో రేగిన మంటలు గురువారం ఉదయానికి కూడా అదుపులోకి రాలేదు.
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయో మాక్స్ ప్లాంట్‌లో రేగిన మంటలు గురువారం ఉదయానికి కూడా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్న ఇంకా అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్యానికి మంటలు అదుపులోకి వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఈ ప్రమాదంలో దాదాపు 12 చమురు ట్యాంకులు అగ్నికి ఆహుతి అయ్యాయి. బయో మాక్స్ ప్లాంట్లో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాటి నుంచి ఆ మంటలు అదుపులోకి రాలేదు.
ఇదిలా ఉంటే బయో మ్యాక్స్ అగ్నిప్రమాదంపై జిల్లాకలెక్టర్ యువరాజ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ పరిశ్రమలో కనీస భద్రత ప్రమాణాలు పాటించడం లేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సేప్టీ ఆడిట్కు ప్రభుత్వం ఆదేశించింది.