ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత | High tensions at andhra - karnataka border | Sakshi
Sakshi News home page

ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

Oct 4 2015 10:28 AM | Updated on Aug 18 2018 4:35 PM

స్వర్ణముఖి నదిపై నిర్మించిన గోడ వివాదం నేపథ్యంలో ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత ఆదివారం కూడ కొనసాగుతోంది.

అనంతపురం : స్వర్ణముఖి నదిపై నిర్మించిన గోడ వివాదం నేపథ్యంలో ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత ఆదివారం కూడ కొనసాగుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఇరు రాష్ట్రాల పోలీసులు బలగాలు భారీగా మోహరించారు. నదిపై నిర్మించిన గోడను తొలగిస్తే ఆగలి చెరువుకు నీరు రాదని ఆంధ్రప్రదేశ్ రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ గోడ తొలగిస్తామని ఇప్పటికే కర్ణాటక రైతు సంఘాలు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. సదరు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులోభాగంగా రైతులు నదిపై నిర్మించిన గోడ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement