వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రికత్తత చోటుచేసుకుంది.
ప్రొద్దుటూరు: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాగునీటి సమస్యలపై సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జలదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించిన రాచమల్లు ప్రాసాద్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ.. వైఎస్‌ఆర్ సీపీ నేతలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. సమస్యలపై గొంతెత్తకుండా అడ్డుకుంటున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.