ఘనంగా వసంతోత్సవం | henjeru sidheswara vasanthothsavam | Sakshi
Sakshi News home page

ఘనంగా వసంతోత్సవం

Mar 2 2017 10:32 PM | Updated on Sep 5 2017 5:01 AM

మండలంలోని హేమావతిలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వసంతోత్సవం నిర్వహించారు.

అమరాపురం : మండలంలోని హేమావతిలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళహారతి పట్టారు. తరువాత సిద్దలింగేశ్వరస్వామి వసంతం సేవ నిర్వహించారు. అనంతరం స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.2.69 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement