ఇబ్బందులు చెప్పేందుకే హర్తాళ్‌కు మద్దతు | harthal ysr cp suport | Sakshi
Sakshi News home page

ఇబ్బందులు చెప్పేందుకే హర్తాళ్‌కు మద్దతు

Nov 27 2016 11:29 PM | Updated on May 25 2018 9:20 PM

పెద్ద నోట్ల రద్దును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తున్నప్పటికీ, దాని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వ విఫలమవడం వల్లే హర్తాళ్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ యూత్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. నగరంలో కటకంశెట్టి పాండురంగారావు నివాస గృహంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు

  • వైఎస్సార్‌ సీపీ యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజా 
  • నగరం (మామిడికుదురు) : 
    పెద్ద నోట్ల రద్దును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తున్నప్పటికీ, దాని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వ విఫలమవడం వల్లే హర్తాళ్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆ  పార్టీ యూత్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. నగరంలో కటకంశెట్టి పాండురంగారావు నివాస గృహంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, కార్మికులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజా అన్నారు. నోట్ల రద్దు వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాపులను బీసీల జాబితాల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని దాన్ని అమలు చేయాలని తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. బీసీలకు అన్యాయం జరుగకుండా, వారికి ఇబ్బంది లేకుండా కాపులను బీసీల జాబితాల్లో చేర్చాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహ¯ŒS అన్నారు. సమావేశంలో పి.గన్నవరం కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, నాయకులు పేరి శ్రీనివాస్, బొలిశెట్టి భగవాన్, అడ్డగళ్ల సాయిరామ్, గుత్తుల బాబి, ఎంఎం శెట్టి, జక్కంపూడి వాసు, కిరణ్‌ పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement