నీలగిరిలో మెగా ప్లాంటేషన్ | haritha haram in nalgonda district | Sakshi
Sakshi News home page

నీలగిరిలో మెగా ప్లాంటేషన్

Jul 16 2016 8:07 PM | Updated on Mar 22 2019 7:19 PM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మెగా ప్లాంటేషన్ నిర్వహించడానికి మున్సిపాలిటీ యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

  18వ తేదీన ఒకే రోజు 85వేల మొక్కలు నాటేందుకు శ్రీకారం 
  మహిళలకు బొట్టు పెట్టి మొక్కలు పంచనున్న సమభావన సంఘాల సభ్యులు
  ప్రణాళిక సిద్ధం చేసిన మున్సిపాలిటీ యంత్రాంగం 
 
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్ర తిష్టాత్మకంగా  చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మెగా ప్లాంటేషన్ నిర్వహించడానికి మున్సిపాలిటీ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఒకే రోజు నల్లగొండ మున్సిపాలిటీ పరిధి లో 85 వేల మొక్కలు నాటి రికార్డు సృష్టించేందుకు  అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నల్లగొండ పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం 1 లక్షా 67 వేలకు పైగా జనాభా ఉంది.  ఈ జనాభా ప్రకారం పట్టణం లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. హరితహారం కార్యక్రమంలో పట్టణంలో 4.50 లక్షల మొక్కలు నాటడానికి మున్సిపల్ యంత్రాంగం ఇప్పటికే కార్యచరణ రూపొందించింది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందు కు ఒకే రోజు భారీ స్థాయిలో మొక్కలు నాటాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్ని మున్సిపాలిటీలకు అదేశాలు జారీ చేశారు. ఈనెల 18న  అన్ని మున్సిపాలిటీలలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. 
 
 మహిళలకు బొట్టు పెట్టి...
పట్టణంలో ఉన్న సమభావన సంఘాల మహిళలను పూర్తి స్థాయిలో హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మెగా ప్లాంటేషన్ విజయవంతం చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు.  పట్టణంలో  21,700 మంది స్వయం సహాయక సంఘా ల సభ్యులు ఉన్నారు. వీరందరూ తమ ఇళ్లతో పాటు ఇంటి ముందు చెట్లు నాటేవిధంగా వారికి అవగాహన కల్పించారు. ప్రతి మహిళకు 10మొక్కల చొప్పున పంపిణీ చేసి వాటిని నాటే విధంగా కార్యచరణ రూ పొందించారు. ఇతర మహిళలకు సమభావన సం ఘాల సభ్యులు బొట్టుపెట్టి  మొక్కలు పంపిణీ చేయనున్నారు.  ఏవార్డుకు ఆ వార్డులోనే ప్రజాప్రతినిధులనుభాగస్వాములను చేయనున్నారు.
 
 మొక్కలు నాటే ప్రాంతాలు..
పానగల్ ఎస్టీపీ వద్ద 3 వేలు, లేఅవుట్‌లు, ఓపెన్ స్థలా లు, గాయత్రి హోమ్స్, రెడ్డి కాలనీ, గ్రీన్ సిటీ, ద్వార కానగర్, సాయి విశ్వనాధ్ లే అవుట్ ప్రాంతాల్లో 7500, కలెక్టరేట్ సమీపంలో 8 వేలు, కామేశ్వర్ కాల నీ పార్కు 350, ఫిల్టరేషన్ ప్లాంట్ వద్ద 300, మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 వేలు, డాన్ బోస్కో స్కూల్, గౌతమి కాలేజీలు 1000, సమభావన సంఘాల గ్రూపులు 60 వేల మొక్కలు నాటే విధంగా ప్రణాళిక తయారు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement