విద్యార్థుల త్యాగాలు మరిచిన ప్రభుత్వం | governament no recocnise students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల త్యాగాలు మరిచిన ప్రభుత్వం

Aug 13 2016 10:22 PM | Updated on Sep 4 2017 9:08 AM

కరీంనగర్‌ : ప్రభుత్వం విద్యార్థుల త్యాగాలను మరిచి స్వార్థ రాజకీయాల ప్రభుత్వం వ్యవహరిస్తుందని రిపబ్లికన్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు సూకురి అశోక్‌ మండిపడ్డారు. అంబేద్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో శనివారం నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

కరీంనగర్‌ : ప్రభుత్వం విద్యార్థుల త్యాగాలను మరిచి స్వార్థ రాజకీయాల ప్రభుత్వం వ్యవహరిస్తుందని రిపబ్లికన్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు సూకురి అశోక్‌ మండిపడ్డారు. అంబేద్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో  శనివారం నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు కెంసారం సాయికృష్ణ, లింగంపల్లి పవన్‌కల్యాణ్, ధీరజ్, శంకర్, అరుణ్‌కుమార్, కమలాకర్, శివ, సాయి, ప్రవీణ్, అమృత్‌సింగ్, అక్షయ్, అంజయ్య, సయ్యద్‌ ఇస్రఫ్, యూసుఫ్, పవన్‌  పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement