కరాటే పోటీలకు గంగాపురం విద్యార్థులు | Gangapuram students to participate in International Karatee competitions | Sakshi
Sakshi News home page

కరాటే పోటీలకు గంగాపురం విద్యార్థులు

Oct 28 2015 4:51 PM | Updated on Sep 3 2017 11:38 AM

అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న విద్యార్థులతో మాస్టర్లు

అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న విద్యార్థులతో మాస్టర్లు

విశాఖపట్నంలో ఈనెల 30, 31, 1 తేదీల్లో అంతర్జాతీయ కరాటే పోటీలు జరగనున్నాయి.

జడ్చర్ల టౌన్‌(మహబూబ్‌నగర్): విశాఖపట్నంలో ఈనెల 30, 31, 1 తేదీల్లో అంతర్జాతీయ కరాటే పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురానికి చెందిన మాస్టర్ కేశవ్‌బూడోకాన్ కరాటేక్ లబ్‌కు చెందిన విద్యార్థులు బుధవారం జడ్చర్ల నుంచి బయలుదేరి వెళ్లారు.

 

పోటీలకు ఎంపికయిన వారిలో శివకుమార్, శ్రీనివాసచారి, అంబిక, రుషికేష్, అవినాష్, భానుప్రకాష్‌లు ఉన్నారని క్లబ్ ఫౌండర్ కేశవ్ తెలిపారు. వీరు బ్లాక్‌బెల్ట్, కటాస్, సైపరింగ్ విభాగాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. పోటీలకు భారతదేశంతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, బూటాన్, నేపాల్, కొరియా, చైనా మాల్దీవులు, ఇరాన్, సౌది అరేబియా, కొరియా దేశాలకు చెందిన వారు పాల్గొనున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement