చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ | Foundation of the chakali ilamma statue | Sakshi
Sakshi News home page

చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ

Jul 24 2016 8:55 PM | Updated on Sep 4 2017 6:04 AM

చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ

చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ

మోటకొండూర్‌(యాదగిరిగుట్ట): మోటకొండూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం రజక యువజన సంఘం నాయకులు భూమి పూజ చేశారు.

మోటకొండూర్‌(యాదగిరిగుట్ట): మోటకొండూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం రజక యువజన సంఘం నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వడ్డెబోయిన శ్రీనివాస్, కొన్నె సంపత్, వడ్డెబోయిన శ్రీధర్‌ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. భావితరాలకు ఐలమ్మ చరిత్రను తెలియజేయాలన్నారు. ఐలమ్మ వర్థంతిని ప్రభుత్వమే అధికారికంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెబోయిన ఆంజనేయులు, బొట్ల నర్సింహ, వంగపల్లి ఉప్పలయ్య, బాల్ద రామకృష్ణ, భూమండ్ల సుధీర్, కృష్ణ, రాజయ్య, శ్రీను, శివయ్య, పాండు, కనకయ్య, వెంకటేష్, అచ్చయ్య, చంద్రశేఖర్‌ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement