చీటింగ్‌ కేసులో మాజీ ఎమ్మార్వో అరెస్ట్‌ | former MRO arrested in cheating case | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసులో మాజీ ఎమ్మార్వో అరెస్ట్‌

Jan 3 2017 9:48 PM | Updated on Aug 20 2018 4:27 PM

చీటింగ్‌ కేసులో మాజీ ఎమ్మార్వో అరెస్ట్‌ - Sakshi

చీటింగ్‌ కేసులో మాజీ ఎమ్మార్వో అరెస్ట్‌

చీటింగ్‌ కేసులో మాజీ ఎమ్మార్వోను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తల్లాడ(ఖమ్మం జిల్లా): ఓ ఛీటింగ్‌ కేసులో తల్లాడ మాజీ ఎమ్మార్వో టి. ప్రకాశ్‌బాబు, మాజీ వీఆర్‌ఓ నర్సింహారావును తల్లాడ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

వివరాలు..తల్లాడ సర్వే నెంబర్‌ 705లో గురజాల సీతారామచంద్రరావు అనే వ్యక్తికి 23 కుంటల భూమి ఉంది. దీనిని తల్లాడకు చెందిన పెండ్రు పున్నమ్మ అనే మహిళ పేరిట ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించి భూబదలాయింపు చేశారు. ఈ తతంగం అంతా ప్రకాశ్‌బాబు తల్లాడ ఎమ్మార్వో  ఉన్న 2011లో జరిగింది. మూడు రోజుల క్రితం అసలు భూమి యజమాని గురజాల సీతారామచంద్రరావుకు విషయం తెలిసింది. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి మంగళవారం మాజీ వీఆర్‌ఓ, ఎమ్మార్వోలను అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement