మృతుని కుటుంబానికి ఆర్థికసాయం
అనాజిపురం (పెన్‌పహాడ్) : మండల పరిధిలోని అనాజిపురం గ్రామానికి చెందిన యర్కచర్ల సైదులు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు.
అనాజిపురం (పెన్‌పహాడ్) : మండల పరిధిలోని అనాజిపురం గ్రామానికి చెందిన యర్కచర్ల సైదులు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఇతడు పీఏసీఎస్‌లో సభ్యుడిగా ఉండడంతో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు గురువారం రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సూర్యాపేట ఎన్‌డీసీసీబీ సహకార బ్యాంకు మేనేజర్ సుగుణ్, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు అనుములపురి శ్రీలత, సీఈఓ ఆలకుంట్ల సైదులు, అనుములపురి శ్రీనివాస్, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, మేకల నర్సిరెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.