అనంతపురం సెంట్రల్ : ఎలాగైనా తనం పొలం లాక్కోవాలని చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ కొర్రపాటి కేశప్ప యత్నిస్తున్నాడని బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన రైతు రామలింగరెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో కలెక్టర్ శశిధర్‌కు, జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ పొలం పక్కన చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ కేశప్ప 25 ఎకరాల భూమి కొనుగోలు చేశాడన్నారు. పక్కనే ఉన్న 5.95 పొలాన్ని కూడా తనభూమిలోకి కలుపుకోవాలని ప్రయత్నించినప్పటికీ రామలింగారెడ్డి అమ్మడానికి ఒప్పుకోలేదన్నారు. దీంతో ఎలాగైనా ఆ పొలాన్ని లాక్కోవాలని డీఎస్పీ యత్నిస్తున్నాడని ఆరోపించారు. అంతేకాక రైతును పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడన్నారు. గత నెల 29న 192 రామలింగారెడ్డి పొలంలోని చీనీ మొక్కలను కూడా ధ్వంసం చేయించారన్నారు. ఈ ఘటనపై బుక్కపట్నం పోలీస్‌స్టేష¯ŒSలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డీఎస్పీపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరారు.