అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మదనపల్లి మండలం గుర్రంవాండ్ల పల్లి పంచాయతీ బత్తినిగారిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన వెంకటాద్రి నాయుడు(38) అనే రైతుకు ఇటీవల వ్యవసాయంలో నష్టం వచ్చి సుమారు రూ.2 లక్షల అప్పు అయింది. ఈ ఏడాది వేసిన వేరుశనగ పంట కూడా వర్షాలు లేక ఎండిపోయింది. ఆరోగ్యం కూడా బాగాలేక ఇటీవల మెదడుకు ఆపరేషన్ కూడా అయింది. చేసిన అప్పులు తీర్చలేక..అప్పు పుట్టే మార్గం తోచక మనస్తాపంతో నాయుడు శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.