అంతా ఎన్నికల స్టంటే | Sakshi
Sakshi News home page

అంతా ఎన్నికల స్టంటే

Published Mon, Jul 24 2017 10:36 PM

Everything is election stante

  •  ఉప ఎన్నికలో గెలిచేందుకు గడ్డితినేందుకైనా చంద్రబాబు సిద్ధమే
  • గుంతకల్లు మహాధర్నాలో చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్‌ రఘువీర ఫైర్‌
  • గుంతకల్లు : సీఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఎలాంటి గడ్డి తినడానికైనా, అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధంగా ఉన్నారని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆరోపించారు.  ఒక్క నంద్యాల పట్టణంలోనే 13 వేల నివాస గృహాలు మంజూరు చేశారని, కరువు జిల్లా అనంతపురంలో మూడేళ్ల కాలంలో ఎన్ని పక్కాగృహాలు నిర్మించారని ప్రశ్నించారు. ఈ సమాధానమే చంద్రబాబు ఎన్నికల స్టంట్‌ను బహిర్గతం చేస్తుందని ఎద్దేవా చేశారు.

    రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్లులో మహాధర్నా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి అజంతా సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి దౌల్తాపురం ప్రభాకర్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ తదితరులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని పంటలకు ఫసల్‌ బీమా పథకాన్ని వర్తింపజేస్తుంటే అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఈ మూడేళ్ల కాలంలో 250కి పైగా చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులైన రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ సాధించడానికే ఈ ధర్నా చేపట్టామన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బీసీసెల్‌ కార్యదర్శి గాలి మల్లికార్జున,  పట్టణ అధ్యక్షుడు లక్ష్మీనారాయణయాదవ్, నాయకులు ఆలంనవాజ్, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

     

Advertisement
Advertisement