breaking news
Raghuvir Reddy
-
నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి భయం
పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి విమర్శ అనంతపురం సెంట్రల్: నంద్యాల ఉప ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఏనాడు నంద్యాలను పట్టించుకోని ఆయన ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో హామీల వర్షం కురిపిస్తున్నారన్నారు. జాషువ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం అనంతపురంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత గుర్రం జాషువాకే దక్కుతుందన్నారు. అయితే నేడు కేంద్ర, రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతుండడం బాధాకరమన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయని చంద్రబాబు నంద్యాలకు 13వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారన్నారు. 10వేల పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. అంతేకాకుండా మంత్రులు, ఎంపీలు, ఇతర పారిశ్రామికవేత్తలను నంద్యాలలో మకాం వేయిస్తుండటం చూస్తే ఓటమి భయంతోనే అనే విషయం స్పష్టమవుతోందన్నారు. సీఎం స్థాయిలోని వ్యక్తి తాను వేయించిన రోడ్లపై నడుస్తున్నారు.. తానిచ్చిన పింఛన్లు తింటున్నారని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా çసత్యనారాయణ, పీసీసీ అధికారప్రతినిధి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా ఎన్నికల స్టంటే
ఉప ఎన్నికలో గెలిచేందుకు గడ్డితినేందుకైనా చంద్రబాబు సిద్ధమే గుంతకల్లు మహాధర్నాలో చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ రఘువీర ఫైర్ గుంతకల్లు : సీఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఎలాంటి గడ్డి తినడానికైనా, అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధంగా ఉన్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఒక్క నంద్యాల పట్టణంలోనే 13 వేల నివాస గృహాలు మంజూరు చేశారని, కరువు జిల్లా అనంతపురంలో మూడేళ్ల కాలంలో ఎన్ని పక్కాగృహాలు నిర్మించారని ప్రశ్నించారు. ఈ సమాధానమే చంద్రబాబు ఎన్నికల స్టంట్‌ను బహిర్గతం చేస్తుందని ఎద్దేవా చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్లులో మహాధర్నా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అజంతా సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్చార్జి దౌల్తాపురం ప్రభాకర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని పంటలకు ఫసల్ బీమా పథకాన్ని వర్తింపజేస్తుంటే అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఈ మూడేళ్ల కాలంలో 250కి పైగా చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులైన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సాధించడానికే ఈ ధర్నా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి గాలి మల్లికార్జున, పట్టణ అధ్యక్షుడు లక్ష్మీనారాయణయాదవ్, నాయకులు ఆలంనవాజ్, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.