ఊపిరి తీసిన ఉపాధి | Employment taken breath | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసిన ఉపాధి

Apr 2 2017 11:12 PM | Updated on Sep 5 2017 7:46 AM

ఊపిరి తీసిన ఉపాధి

ఊపిరి తీసిన ఉపాధి

ఉపాధి కోసమని కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన వలస కూలి మృత్యువాత పడిన సంఘటన ఆదివారం బెంగళూరులో చోటు చేసుకుంది.

– బెంగళూరులో ప్రమాదవశాత్తు కిందపడ్డ వలస కూలీ 
–చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి 
 
కళ్యాణదుర్గంరూరల్:  ఉపాధి కోసమని కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన వలస కూలి మృత్యువాత పడిన సంఘటన ఆదివారం బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని తూర్పు కోడిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాగన్న(50) తనకున్న 3.80 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ సాగించే వాడు. ఈ క్రమంలో కొంత కాలంగా వర్షాలు పడక పంటలు పండక పోవడంతో కుటుంబ పోషణ భారమైంది. కనీసం గ్రామంలో ఉపాధి పనులు లేక పోవడంతో బెంగళూరుకు వలస వెళ్లాడు.  కుటుంబ సభ్యులతో కలిసి రూపే నగర్‌ హెచ్‌ఎస్‌ఆర్‌ లే అవుట్‌ వద్ద ఉంటూ కూలి పనికి వెళ్లేవాడు. 
భవనంపైనుంచి కిందపడి..
మార్చి 26న అక్కడ ఇంటి నిర్మాణానికి నీరు పెడుతుండగా ప్రమాదవ శాత్తు మూడంతస్తుల మేడ పైనుంచి కిందకు పడ్డాడు.  తలకు, నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కుటుంబీకులు అక్కడే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికు తరలించారు.  ఆదివారం అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామమైన తూర్పు కోడిపల్లి ఎస్టీ కాలనీకి తీసుకొచ్చారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇక మాకు దిక్కెవరంటూ బోరున విలపించారు. అతడికి ఇద్దరు కుమారులు,ఒక కుమార్తెలు ఉన్నారు.

Advertisement

పోల్

Advertisement