‘చీనీ మొక్కలను ధ్వంసం చేయించింది డీఎస్పీనే’ | dsp abolished chimi trees | Sakshi
Sakshi News home page

‘చీనీ మొక్కలను ధ్వంసం చేయించింది డీఎస్పీనే’

Dec 31 2016 10:57 PM | Updated on Sep 15 2018 8:05 PM

తన పొలంలో నాటిన చీనీ మొక్కలను ధ్వంసం చేయించింది డీఎస్పీ కేశన్న అని బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన రామలింగారెడ్డి, అనూరాధ దంపతులు శనివారం ఆరోపించారు.

బుక్కపట్నం : తన పొలంలో నాటిన చీనీ మొక్కలను ధ్వంసం చేయించింది డీఎస్పీ కేశన్న అని బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన రామలింగారెడ్డి, అనూరాధ దంపతులు శనివారం ఆరోపించారు. రాశింపల్లి సమీపంలో ఆరెకరాల భూమిని కొనుగోలు చేసి, బోరు వేసుకుని 600 చీనీ చెట్లు నాటుకున్నామన్నారు. తనకు దక్కని భూమి మరెవ్వరికీ దక్కకూడదన్న కుట్రతో రాశింపల్లికి చెందిన డీఎస్పీ కేశన్న తన పోలీస్‌ అధికారాన్ని అడ్డు పెట్టుకుని 400 మొక్కలను గురువారం రాత్రి నాశనం చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement