‘‘ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాలో పేర్లు ఉన్నాయని, వెళ్లి బ్యాంకులో డబ్బు అడగండని మండల వ్యవసాయాధికారి చెప్పారు.
అనంతపురం అర్బన్ : ‘‘ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాలో పేర్లు ఉన్నాయని, వెళ్లి బ్యాంకులో డబ్బు అడగండని మండల వ్యవసాయాధికారి చెప్పారు. తీరా బ్యాంకుకు వెళితే డబ్బు జమకాలేదంటున్నారు. కొన్ని వారాలుగా తిరుగుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదు.’’ అంటూ శింగనమల మండలం ఈస్ట్ నర్సాపురం రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఖాతాల్లో డబ్బు జమ చేసేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. తమ సమస్యను కలెక్టర్‌కు చెప్పుకుందామని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే మీకోసం లేదని తెలిసి ఊసూరుమంటూ వెనుదిరిగారు.