డయాలసిస్‌ యూనిట్‌ సేవలు ప్రారంభం | dialasys unit begin | Sakshi
Sakshi News home page

డయాలసిస్‌ యూనిట్‌ సేవలు ప్రారంభం

Nov 12 2016 10:37 PM | Updated on Sep 4 2017 7:55 PM

తణుకు ఏరియా ఆసుపత్రిలో లయన్స్‌ ఆధ్వర్యంలో వంక సత్యనారాయణ, నాగమణి డయాలసిస్‌ యూనిట్‌ సేవలు ప్రారంభించినట్లు ముఖ్యదాత, సెకండ్‌ వైస్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ వంక రవీంద్రనా«ద్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం డయాలసిస్‌ కేంద్రాన్ని పరిశీలించి రోగులను పరామర్శించారు. తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కిడ్నీ రోగులు వారి రక్తశుద్ధి కోసం ఈ నూతన కేంద్రానికి వచ్చి డయాలసిస్‌ చేయించుకుంటున్నారని చెప్పారు.

తణుకు: తణుకు ఏరియా ఆసుపత్రిలో లయన్స్‌ ఆధ్వర్యంలో వంక సత్యనారాయణ, నాగమణి డయాలసిస్‌ యూనిట్‌ సేవలు ప్రారంభించినట్లు ముఖ్యదాత, సెకండ్‌ వైస్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ వంక రవీంద్రనా«ద్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం డయాలసిస్‌ కేంద్రాన్ని పరిశీలించి రోగులను పరామర్శించారు. తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కిడ్నీ రోగులు వారి రక్తశుద్ధి కోసం ఈ నూతన కేంద్రానికి వచ్చి డయాలసిస్‌ చేయించుకుంటున్నారని చెప్పారు. అత్యాధునిక పది డయాలసిస్‌ యంత్రాలతో ఇటీవల లయన్స్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌రాజు చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. మిషన్లు అన్ని సక్రమంగా పని చేసి రోగులకు పూర్తి సంతృప్తి ఇచ్చే విధంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఒక సారి డయాలసిస్‌ చేయించుకోవాలంటే రూ. 800 చెల్లిస్తే సరిపోతుందని ఇతర మందులు, పరికరాలు కూడా పూర్తిస్థాయిలో తగ్గింపు ధరల్లో తీసుకుంటామని వివరించారు. డయాలసిస్‌ చేయించుకునే రోగులు గతంలో ఏలూరు, భీమవరం వెళ్లేందుకు ప్రయాసపడేవారన్నారు. అయితే అధిక వ్యయప్రయాసలకయ్యే పని ఇక్కడ కేంద్రం ఉండటం కారణంగా సమయం వృధా కాకుండా తక్కువ ధరకు డయాలసిస్‌ పొందగలుతున్నారన్నారు. మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ వంక రాజకుమారి రోగులందరినీ వ్యక్తిగతంగా పలకరించి డయాలసిస్‌ పొందుతున్నప్పుడు వారి అనుభవాలను తెలుసుకుని నిర్వహకులకు సూచనలు ఇచ్చారు. ఈ క ఆర్యక్రమంలో పాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ ఎం.బాబూరావు, డిస్ట్రిక్ట్‌ జిల్లా జిల్లా లయన్స్‌ నాయకులు దామెర రంగారావు, డాక్టర్‌ జీవీవీ సత్యనారాయణ, ఏలూరి శ్రీమన్నారాయణ, కల్లూరి త్రిమూర్తులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement