ఐపీఎస్‌ల భార్యలతో డీజీపీ సతీమణి సమావేశం | dgp jv ramudu wife meet senior ips officers wives | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ల భార్యలతో డీజీపీ సతీమణి సమావేశం

Feb 24 2016 9:19 AM | Updated on Sep 3 2017 6:20 PM

రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు సతీమణి జె.పద్మావతి మంగళవారం సీనియర్ పోలీసు అధికారుల సతీమణులతో అతిథి గృహంలో సమావేశమయ్యారు.

 విజయవాడ సిటీ:  రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు సతీమణి జె.పద్మావతి మంగళవారం సీనియర్ పోలీసు అధికారుల సతీమణులతో అతిథి గృహంలో సమావేశమయ్యారు. జూన్ నాటికి విజయవాడ వచ్చేందుకు ఉన్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వచ్చే జూన్ నాటికి అధికార యంత్రాంగం విజయవాడకు తరలి రావాలంటూ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సీనియర్ పోలీసు అధికారుల భార్యలతో ఆమె సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడకు రావాల్సిన ఆవశ్యకత ఆమె వారికి వివరించినట్టు తెలిసింది. ఇదే సమయంలో వారితో కలసి ఉన్నతాధికారుల వసతి కోసం నిర్దేశించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రెయిన్ ట్రీ పార్కు భవనాలను పరిశీలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement