రాష్ట్రానికి చిన్ననోట్లను పెద్ద మొత్తంలో కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరున్‌జైట్లీని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు.
జైట్లీని కోరిన దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చిన్ననోట్లను పెద్ద మొత్తంలో కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరున్‌జైట్లీని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు జైట్లీని దత్తా త్రేయ కలిశారు. రాష్ట్రంలో చిల్లర సమస్య తీవ్రమైందని, కార్మికులు, గ్రామీణ ప్రాంత కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలి పారు. రూ.10, 20, 50, 100 నోట్లను అధిక మొత్తంలో రాష్ట్రానికిస్తే కాస్త ఉపశమ నం కలుగుతుందన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని.. కార్మిక శాఖ, బ్యాంకర్లు సంయుక్తంగా 52,852 క్యాంపులు నిర్వహించి 13.76 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు వివరించారు.