గెర్దావ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో లారీ క్లీనర్‌ మృతి | cleaner dies of dolamite powder unload | Sakshi
Sakshi News home page

గెర్దావ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో లారీ క్లీనర్‌ మృతి

Nov 29 2016 10:42 PM | Updated on Sep 4 2017 9:27 PM

పట్టణంలోని గెర్దావ్‌ స్టీల్‌ ప్లాంటులో డోలమైట్‌ ఫౌడర్‌ అన్‌లోడ్‌ చేస్తుండగా ప్రమాద వశాత్తు లారీ డోర్‌ తగిలి కర్నూల్‌ జిల్లా డోన్‌ మండలం కొత్తచెరువు గ్రామానికి చెందిన లారీ క్లీనర్‌ తిమ్మా గురుడు (40) మంగళవారం రాత్రి మృతి చెందాడు.

తాడిపత్రి రూరల్‌ : పట్టణంలోని గెర్దావ్‌ స్టీల్‌ ప్లాంటులో డోలమైట్‌ ఫౌడర్‌ అన్‌లోడ్‌ చేస్తుండగా ప్రమాద వశాత్తు లారీ డోర్‌ తగిలి కర్నూల్‌ జిల్లా డోన్‌ మండలం కొత్తచెరువు గ్రామానికి చెందిన లారీ క్లీనర్‌ తిమ్మా గురుడు (40) మంగళవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..డోన్‌కు చెందిన లారీ తాడిపత్రి నియోజకవర్గంలోని కిష్టపాడు గ్రామంలో లారీలో డోలమైట్‌ లోడ్‌ చేసుకుని గెర్దావ్‌ స్టీల్‌ ప్లాంటుకు తీసుకొచ్చారు.

స్టీల్‌ ప్లాంటులో డోలమైట్‌ అన్‌లోడ్‌ చేస్తుండగా క్లీనర్‌ తిమ్మాగురుడుకు డోర్‌ తగిలి కింద పడ్డాడు. గమనించని డ్రైవర్‌ లారీ డోర్‌ తీశాడు. దీంతో లిఫ్ట్‌ ఓపన్‌ అయ్యి ఫౌడర్‌ అన్‌లోడ్‌ అయ్యింది. తిమ్మాగురుడుపై ఫౌడర్‌ పడటంతో ఊపిరి ఆడక అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ నారాయణరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement