‘ఆట’హాసంగా.. | chess, carroms tourney | Sakshi
Sakshi News home page

‘ఆట’హాసంగా..

Aug 30 2016 10:58 PM | Updated on Sep 4 2017 11:35 AM

‘ఆట’హాసంగా..

‘ఆట’హాసంగా..

స్థానిక జేఎన్‌రోడ్‌లోని సూర్యగార్డెన్స్‌లో రెండురోజులుగా జరుగుతున్న ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కారమ్స్‌ అండ్‌ చెస్‌ టోర్నమెంట్‌ ముగిసింది.

  • ముగిసిన ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కారమ్స్‌ 
  • అండ్‌ చెస్‌ టోర్నమెంట్‌ 
  • రాజమహేంద్రవరం: స్థానిక జేఎన్‌రోడ్‌లోని సూర్యగార్డెన్స్‌లో రెండురోజులుగా జరుగుతున్న ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కారమ్స్‌ అండ్‌ చెస్‌ టోర్నమెంట్‌ ముగిసింది. మంగళవారం జరిగిన క్యారమ్స్‌ సెమీఫైనల్స్, ఫైనల్స్‌ ఉత్కంఠంగా సాగాయి. మహిళలు విభాగం ఫైనల్స్‌లో అంతార్జాతీయ క్యారమ్స్‌ క్రీడాకారిణులు ఎస్‌.అపూర్వ(హైదరాబాద్‌), పి.నిర్మల(వరంగల్‌)లు తలపడ్డారు. వీరి ఆటను అందరూ ఆసక్తిగా తిలకించారు. మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. నిర్మలపై అపూర్వ 25–4, 19–4 పాయింట్లుతో గెలుపొందింది.
     
    మూడు, నాలుగుస్థానాలు కోసం పోటీపడిన మ్యాచ్‌లో వీకే కాగనల్లి(దార్వడ్‌), ఎస్‌.అనలాదేవి(బెంగుళూరు)పై 22–16,20–21,24–10 పాయింట్లతో గెలుపొందింది. కె.వీణ(మైసూరు), సవిత(బెంగుళూరు), కె.జయశ్రీ(హైదరాబాద్‌), కుసుమకుమారిలు ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. పురుషుల ఫైనల్స్‌లో కె.బాలగురవయ్య(బెంగుళూరు), కె.రాఘవేంద్రరావు(హైదరాబాద్‌)పై 5–18,25–0,17–16 పాయింట్లతో గెలుపొందగా, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో ఎంబీ జగన్నాథరావు(విశాఖపట్నం), డి.వీరలింగం(హైదరాబాద్‌)పై 14–13,25–04 పాయింట్లుతో గెలుపొందాడని, కృష్ణానాయక్‌(షియాగో), వీఎస్‌ శ్రీనివాసన్‌(మైసూరు), బి.అజయకుమార్‌(హైదరాబాద్‌), జే.కిషన్‌(వరంగల్‌)ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారని క్యారమ్స్‌ చీఫ్‌ రిఫరీ అస్మదుల్లా తెలిపారు.
     
    చేస్‌పోటీల్లో విజేతలు వీరే...
    రెండు రోజులపాటు ఆరురౌండ్లు జరిగిన చెస్‌ పోటీల్లో పురుషుల విభాగంలో ఐదు పాయింట్లుతో కె.నారాయణభట్‌(షియోగా) ప్రథమ, 4.5 పాయింట్లతో పి.చిన్నస్వామి(విశాఖపట్నం) ద్వితీయ, ఆర్‌.శ్రీధర్‌(నెల్లూరు) తృతీయ, కేఆర్‌ఎస్‌.శంకర్‌బాబు(రాజమహేంద్రవరం) చతుర్ధ, ఆర్‌.జయదేవ్‌(హైదరాబాద్‌), వి.శ్రీనివాసులు(మచిలీపట్నం), ఎస్‌ఎం.రవిప్రకాష్‌(మైసూరు), చంద్రశేఖర్‌మూర్తి(బెంగుళూరు) ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలు సాధించారు. మహిళల విభాగంలో 5.5 పాయింట్లుతో సీహెచ్‌ రాధికాదేవి(మచిలీపట్నం) ప్రథమ, ఐదు పాయింట్లుతో వి.రాధాకుమారి(రాజమహేంద్రవరం) ద్వితీయ, 4.5 పాయింట్లుతో బి.రేణుకాకుమారి(సికింద్రాబాద్‌) తృతీయ, నాలుగుపాయింట్లుతో సీహెచ్‌ రాజ్యలక్ష్మి(విశాఖపట్నం) చతుర్ధ, వీనాకామత్‌(బెంగుళూరు), కేహెచ్‌ పద్మావతి(కడప), ఎస్‌.అన్నపూర్ణ(బెంగుళూరు), వీఏ బెలగాలి(బెల్గామ్‌)ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలు సాధించారని చెస్‌ చీఫ్‌ ఆర్బెటర్‌ జీవీ కుమార్‌ తెలిపారు. క్యారమ్స్, చెస్‌ పోటీలను ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ రీజనల్‌ మేనేజరు(హెచ్‌ఆర్‌డి) కేవీపీవీ నరసింహారావు, రాజమహేంద్రవరం డివిజనల్‌ కార్యాలయ  సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ జే.రంగారావు, మేనేజర్‌(పీఆర్‌) నాగేంద్రకుమార్, స్పోర్ట్సు ప్రమోషన్‌బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్‌లు పర్యవేక్షించారు.
     
    ఎల్‌ఐసీ ఆల్‌ ఇండియా టోర్నమెంట్‌లో సౌత్‌సెంట్రల్‌ జోన్‌ సత్తా చాటాలి
    భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఆల్‌ ఇండియా టోర్నమెంట్‌లో సౌత్‌ సెంట్రల్‌జోన్‌ క్రీడాకారులు సత్తా చాటాలని ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ రీజనల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌డీ) కేవీపీవీ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక జేఎన్‌రోడ్‌లోని సూర్యగార్డెన్స్‌లో రెండురోజులపాటు జరిగిన ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కారమ్స్‌ అండ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో విజేతలకు మంగళవారం సాయంత్రం బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ 2015–16లో సౌత్‌సెంట్రల్‌జోన్‌ క్రీడాకారులు ఆల్‌ఇండియా టోర్నమెంటులో ఏడు గోల్డ్, ఐదు సిల్వర్, ఎనిమిది బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారన్నారు.
     
    2016–17 టోర్నమెంట్‌లో ఇప్పటి నుంచి సాధన చేసి ఎక్కువ పతకాలు సాధించేలా కృషి చేయాలన్నారు. రాజమహేంద్రవరం డివిజనల్‌ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ జే రంగారావు మాట్లాడుతూ సౌత్‌సెంట్రల్‌జోన్‌ క్యారమ్స్, చెస్‌ టోర్నమెంటు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన జోనల్‌ మేనేజర్‌ సుశీలకుమార్, రీజనల్‌ మేనేజర్‌ నరసింహారావులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చెస్, క్యారమ్స్‌ పురుష,మహిళల విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించిన విజేతలకు బంగారు, వెండి, కాంస్యపతకాలు, నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ మేనేజరు ఈఏ విశ్వరూప్, మేనేజరు(పీఆర్‌)నాగేంద్రకుమార్, స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డుసభ్యులు మంజునాథ్, జాన్సన్, చెస్‌చీఫ్‌ ఆర్బెటర్‌ జీవీ కుమార్, క్యారమ్స్‌ చీఫ్‌ రిఫరీ అస్మదుల్లా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement