ఆకాశంలో ఖగోళ అద్భుతం..! | celestial phenomenon on the sky | Sakshi
Sakshi News home page

ఆకాశంలో ఖగోళ అద్భుతం..!

Aug 11 2016 10:59 PM | Updated on Sep 27 2018 5:25 PM

ఆకాశంలో గురువారం రాత్రి ఖగోళ అద్భుతం కనువిందు చేసింది. గురువారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 7 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు మూడుగ్రహాలు త్రిభుజాకారంలో కనిపిస్తూ నగర ప్రజలను కనువిందు చేశాయి. గురుడు (జూపిటర్‌), బుధుడు (మెర్యూ్కరీ), శని (వీనస్‌) గ్రహాలు చంద్రుని కింది భాగంలో ఒక క్రమపద్ధతిలో అమరి చూసేందుకు స్పష్టంగా త్రిభుజాకృతిలో కనువిందు చేశాయి.

వైవీయూ: ఆకాశంలో గురువారం రాత్రి ఖగోళ అద్భుతం కనువిందు చేసింది. గురువారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 7 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు మూడుగ్రహాలు త్రిభుజాకారంలో కనిపిస్తూ నగర ప్రజలను కనువిందు చేశాయి. గురుడు (జూపిటర్‌), బుధుడు (మెర్యూ్కరీ), శని (వీనస్‌) గ్రహాలు చంద్రుని కింది భాగంలో ఒక క్రమపద్ధతిలో అమరి చూసేందుకు స్పష్టంగా త్రిభుజాకృతిలో కనువిందు చేశాయి. కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా, స్పేస్‌ మెడిసనల్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప నిర్వాహకులు పలువురికి టెలీస్కోపు ద్వారా మరింత స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. గురుగ్రహం తెల్లటి కాంతితో, బుధగ్రహం ఎర్రటి వర్ణంతో, శనిగ్రహం తెల్లటి కాంతిరహితంగా కనిపించి కనువిందు చేశాయి.
ఉల్కాపాతం..
కాగా పర్‌షిడ్‌ ఉల్కాపాతం గురువారం అర్ధరాత్రి జరగడంతో నగర ప్రజలు ఎక్కువ మంది వీక్షించలేకపోయారు. రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఉల్కాపాతం చోటుచేసుకుందని, దీనిని వీక్షించలేని వారు శుక్రవారం రాత్రి మళ్లీ జరిగే ఉల్కాపాతం వీక్షించవచ్చని ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా, స్పేస్‌ మెడిసనల్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప నిర్వాహకులు అబ్రారుల్‌హక్‌ తెలిపారు. ఈ వీక్షణంలో స్పేస్‌ మెడిసినల్‌క్లబ్‌ సభ్యుడు నాయక్, జాహిద్‌అస్లాం, సాయిబాబా హైస్కూల్‌ విద్యార్థి శానుల్‌ఫైజ్, న్యూహోరైజన్‌ స్కూల్‌ విద్యార్థి సాజిద్‌హుస్సేన్‌లు స్పేస్‌ స్టుమినేటర్స్‌ (ఔత్సాహిక బాలశాస్త్రవేత్తలు)గా విచ్చేసి వీక్షణ కార్యక్రమంలో సహకరించారు.
ఖగోళ వీక్షణానికి అవగాహన అవసరం
ఖగోళంలో చోటుచేసుకునే అద్భుతాలను వీక్షించేందుకు ఖరీదైన టెలీస్కోపు, పరికరాలే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నింటిని ఎలాంటి పరికరాలు లేకుండానే వీక్షించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా గురువారం త్రిభుజాకృతిలో గ్రహాల గమనం ప్రజలు వీక్షించారు.
– ప్రసాద్‌నాయక్, బీఫార్మసి, నిర్మల ఫార్మసీ కళాశాల, కడప
ఖగోళ వీక్షణానికి రెండు సూత్రాలు
ఖగోళ వీక్షణానికి రెండు సూత్రాలు ఉపయోగపడతాయి. అందులో ఒకటి గ్రహానికి, నక్షత్రానికి తేడా. నక్షత్రాలు స్వయంప్రకాశకాలు. గ్రహాలు స్వయం ప్రకాశకాలు కావు. ఇది గుర్తుంచుకుంటే మనం నేరుగా చూడవచ్చు. మనపూర్వీకులు ఈ సూత్రాల ద్వారా గ్రహాలను వీక్షించేవారు. ఈ గ్రహాలను వీక్షించే దిశ, నక్షత్ర రూపంలో ఉండే గ్రహాల వర్ణం గుర్తు పట్టగలిగితే మనమే గ్రహ వీక్షణం చేయవచ్చు.  
– అబ్రారుల్‌హక్, సొసైటీ ఆఫ్‌ ఇండియా, స్పేస్‌ మెడిసనల్‌ క్లబ్‌ ఆఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement