హైనా దాడి చేయడంతో ఓ లేగదూడ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. వనపర్తి మండలంలోని అంజనగిరికి చెందిన మన్నెం వృత్తిరీత్యా రైతు. ఎప్పటిలాగే తమకున్న పశువులను గురువారం సాయంత్రం గట్టు పక్కన ఉన్న పొలంలోని పాకలో వాటిని కట్టి ఇంటికి వచ్చాడు.
హైనా దాడిలో లేగదూడ మృతి
Sep 30 2016 11:54 PM | Updated on Sep 4 2017 3:39 PM
వనపర్తి రూరల్ : హైనా దాడి చేయడంతో ఓ లేగదూడ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. వనపర్తి మండలంలోని అంజనగిరికి చెందిన మన్నెం వృత్తిరీత్యా రైతు. ఎప్పటిలాగే తమకున్న పశువులను గురువారం సాయంత్రం గట్టు పక్కన ఉన్న పొలంలోని పాకలో వాటిని కట్టి ఇంటికి వచ్చాడు.
శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ఓ లేగదూడ చనిపోయి ఉంది. దాని గొంతు వద్ద ఘాట్లు ఉంyì శరీరం నుంచి అవయవాలు బయటకు రావడంతో వెంటనే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సంఘటన స్థలాన్ని ఎఫ్‌ఆర్‌ఓ అబ్రహం పరిశీలించి హైనా దాడిలో దూడ చనిపోయినట్టు నిర్ధారించారు.
Advertisement
Advertisement