
ఎలుగుబంటి దాడిలో రైతు మృతి
ఎలుగుబంటి దాడిలో ఓ రైతు మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో...
అచ్చంపేట: ఎలుగుబంటి దాడిలో ఓ రైతు మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోడ్యానాయక్(50) తన పొలం వద్దకు తెల్లవారుజామున వెళ్లాడు. కంచెలో ఎలుగుబంటి చిక్కుకుంది. దానిని అడవి పంది అనుకొని వెళ్లగొట్టేందుకు దగ్గరికి వెళ్లగా.. ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీంతో బోడ్యా నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కంచె ఉచ్చులో ఇరుక్కుపోయిన ఎలుగుబంటి బోడ్యా శరీర భాగాలను చీల్చి వేసింది.
దీంతో ఎలుగుబంటిని బయటికి తీయడానికి హైదరాబాద్ జూ పార్కుకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటికి బాణంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి.. అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి ఎక్కించి జూ పార్కుకు తరలించారు.