మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ అధారంగా 1ః3 జాబితాను సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఏఓ నర్సయ్య జాబితాలను నోటీస్ బోర్డులో ఉంచారు.
బ్యాక్‌లాగ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక
Sep 17 2016 12:50 AM | Updated on Sep 4 2017 1:45 PM
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ అధారంగా 1ః3 జాబితాను సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఏఓ నర్సయ్య జాబితాలను నోటీస్ బోర్డులో ఉంచారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తెలియజేయాలని పేర్కొన్నారు. మూడు రోజుల అనంతరం అభ్యంతరాలు, మెరిట్‌లను పరిశీలించి తుది ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. టైపిస్టు ఉద్యోగాలకు 20 మంది, జూనియర్ సహాయకులు కమ్ టైపిస్టు ఉద్యోగాలకు 20 మంది, జూనియర్ సహాయకుడి ఉద్యోగాలకు 40 మందితో మెరిట్ లిస్టు తయారు చేసి నోటీస్ బోర్డులో ఉంచారు.
Advertisement
Advertisement