కారును ఢీకొట్టిన ఆటో | Auto, Car Collapse | Sakshi
Sakshi News home page

కారును ఢీకొట్టిన ఆటో

Sep 9 2016 12:00 AM | Updated on Sep 4 2017 12:41 PM

కారును ఢీకొట్టిన ఆటో

కారును ఢీకొట్టిన ఆటో

ముందు వెళ్తున్న కారును ఆటో ఢీకొనడంతో ఆటో ఐదు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

– ఒకరి పరిస్థితి విషమం, ఆరుగురికి తీవ్రగాయాలు
– ఐదు పల్టీలు కొట్టిన ఆటో
ఆకేపాడు, రూరల్‌ ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ, గురువారం
Aakepaadu, Rural SI Mahammad Rafi, Thursday
ఆకేపాడు క్రాస్‌ (రాజంపేట రూరల్‌): ముందు వెళ్తున్న కారును ఆటో ఢీకొనడంతో ఆటో ఐదు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం మండల పరిధిలోని ఆకేపాడు క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపిన వివరాల మేరకు.. గురువారం ఉదయం 10.30గంటల సమయంలో రాజంపేట పట్టణం నుంచి కడప బైపాస్‌ రోడ్డులో ఏపీ03టీవీ6734నెంబర్‌ గల కారు వెళ్తుండగా.. అదే సమయంలో ఏపీ26టీసీ7703నెంబర్‌ గల ఆటో ప్యాసింజర్‌లను తీసుకుని నందలూరువైపు వెళ్లగా ఆకేపాడు క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చేసరికి అతి వేగంతో, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ కారును వెనుకవైపు ఢీకొట్టాడు. కారును ఢీకొన్న ఆటో ప్యాసింజర్‌లు ఉండగానే రోడ్డుపై ఐదు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ప్యాసింజర్‌లు తలా ఒకవైపు పడ్డారు. వారిలో నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లెకు చెందిన నాగయ్య సతీమణి రంగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వెంకటలక్షుమ్మకు పక్కటెముకలు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా ఆటోలో ఉన్న మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రంగమ్మను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఆడో డ్రైవర్‌ పేరు తెలియదని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement