టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు | atrocity case on tdp leader | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు

Jul 17 2016 11:31 PM | Updated on Aug 10 2018 9:46 PM

అనంతపురంలో టీడీపీ నాయకుడు, కార్పొరేటర్‌ భర్త జయరాంనాయుడుపై ఆదివారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌ తెలిపారు.

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురంలో టీడీపీ నాయకుడు, కార్పొరేటర్‌ భర్త జయరాంనాయుడుపై ఆదివారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌ తెలిపారు. నాయుడు ఇంటి ముందు చేపట్టిన మురుగు కాలువ పనుల్లో భాగంగా అడ్డు గా ఉన్న వేపచెట్టును కూలీలు తాతయ్య, మరో ఇద్దరు తొలగిం చారు. దీంతో వారిపై నాయుడు దాడి చేయడమే గాక కులం పేరు తో తమను దూషించి అవమానించినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement