breaking news
jayaram naidu
-
నాన్న మాటల్లోని జీవిత సత్యం.. బోధపడిన ప్రవీణ్ ఆనాటి నుంచి..
వీరయ్య ఒక పేదరైతు. తనకున్న రెండెకరాల పొలంలో రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్. కొడుకును బాగా చదివించి, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని వీరయ్య ఆశ. తనలా తన కొడుకు కష్టాలు పడకూడదు అనుకునేవాడు. చదువుకు తన పేదరికం అడ్డుకాకూడదని తల తాకట్టుపెట్టయినా కొడుకును చదివించాలని దృఢనిశ్చయానికి వచ్చాడు వీరయ్య. కొడుకును పట్నంలో మంచి బడిలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదువుకుని మంచి మార్కులు సంపాదించాడు ప్రవీణ్. స్నేహితులు కూడా పెరిగారు.వాళ్లంతా చెప్పుల నుంచి బట్టల వరకు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులనే వాడేవారు. వారిని చూసి ప్రవీణ్ కూడా తనకూ అలాంటి బ్రాండెడ్ వస్తువులు కావాలని తండ్రిని వేధించసాగాడు. దానికి వీరయ్య ‘చూడు నాయనా.. వారు ధనవంతుల బిడ్డలు. ఎలాగైనా ఖర్చుపెట్టగలరు. నీ చదువుకే నా తలకు మించి ఖర్చుపెడుతున్నాను. మనకు అటువంటి కోరికలు మంచివికావు. మన స్థాయిని బట్టి మనం నడుచుకోవాలి’ అని నచ్చజెప్పాడు. అయినా కొడుకు చెవికెక్కించుకోలేదు. పైపెచ్చు స్నేహితుల తల్లిదండ్రులు.. వాళ్లకేది కావాలంటే అది కొనిస్తున్నారు, పుట్టినరోజులు బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. తనకు మాత్రం తన తండ్రి ఏ సరదా తీర్చడం లేదని అలిగాడు ప్రవీణ్. ఫలితంగా చదువు మీద దృష్టిపెట్టక వెనుకబడిపోయాడు.ఒకసారి.. దసరా సెలవులకు ప్రవీణ్ వాళ్ల అక్క పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు. ఒకరోజు ఆ పిల్లలు మట్టితో బొమ్మరిల్లు కట్టి ఆడుకోసాగారు. ఆ ఇల్లు మీద సూట్‌కేసులు పెద్దపెద్ద బరువైన వస్తువులు పెడదామని చూసింది చిన్నమ్మాయి. పెద్దమ్మాయేమో ‘వద్దు.. మనం అలాచేస్తే బొమ్మరిల్లు కూలిపోతుంది’ అని వారించింది. అయినా చిన్నమ్మాయి వినకుండా ‘ఏమీ కాదు.. తాతగారింటి డాబా మీద పెద్దపెద్ద వస్తువులు పెట్టడం లేదా.. అలాగే ఈ ఇంట్లోనూ పెట్టుకోవచ్చు’ అంటూ మొండికేసింది. ఇదంతా గమనించిన ప్రవీణ్ ‘మీరు కట్టుకుంది బొమ్మరిలు.్ల ఇది ఆడుకోవడానికే కానీ వాడుకోవడానికి కాదు. అందుకే ఇది పెద్ద వస్తువులను మోయలేదు. తాతగారిల్లు రాళ్లు, ఇటుకలు, ఇనుముతో గట్టిగా కట్టినిల్లు. ఆ ఇల్లు మోసే బరువులను ఈ బొమ్మరిల్లు మోయలేదు. కావాలంటే నీకు బొమ్మ సూట్‌కేసులు, బ్యాగులు చేసిస్తాను చూడు..’ అని చెప్పాడు. చెప్పినట్టుగానే వెంటనే మట్టితో ఆ బొమ్మలను చేసిచ్చాడు కూడా! వాటిని చూసి చిన్నపిల్ల భలే ముచ్చటపడింది.ఈ తతంగమంతా చూసిన వీరయ్య.. కొడుకుని మెచ్చుకున్నాడు. తర్వాత కొడుకుతో ‘మన పేద బతుకులు కూడా బొమ్మరిల్లు లాంటివే. ఏమాత్రం బరువెక్కువైనా కూలిపోతాయి. మన స్థాయికి తగ్గట్టు నడుచుకోకపోతే చితికిపోతాం. ఆ చిన్నపిల్ల తెలియక మారాం చేసింది. నీవు తెలిసి తప్పటడుగులు వేస్తున్నావు’ అంటూ జ్ఞానదోయం చేశాడు. నాన్న మాటల్లోని జీవిత సత్యం బోధపడిన ప్రవీణ్ .. ఆనాటి నుంచి బుద్ధిగా చదువుకోసాడు. – జయరామ్ నాయుడు -
అనంతపురంలో ఆసక్తికర పరిణామం
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న అనంతపురంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార టీడీపీకి చెందిన ప్రముఖ నాయకుడు ఒకరు.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంత వెంకట్రామిరెడ్డికి టీడీపీ సీనియర్ నేత జయరాం నాయుడు అనూహ్యంగా మద్దతు తెలిపారు. అంతేకాకుండా అనంత వెంకట్రామిరెడ్డి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి ప్రజలకు చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిన ఆయనను ఓడించాలని జయరాం నాయుడు ఓటర్లను కోరుతున్నారు. -
టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలో టీడీపీ నాయకుడు, కార్పొరేటర్ భర్త జయరాంనాయుడుపై ఆదివారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రాఘవన్ తెలిపారు. నాయుడు ఇంటి ముందు చేపట్టిన మురుగు కాలువ పనుల్లో భాగంగా అడ్డు గా ఉన్న వేపచెట్టును కూలీలు తాతయ్య, మరో ఇద్దరు తొలగిం చారు. దీంతో వారిపై నాయుడు దాడి చేయడమే గాక కులం పేరు తో తమను దూషించి అవమానించినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
'అనంత' టీడీపీలో విభేదాలు
అనంతపురం: స్టాండింగ్ కమిటీ ఎంపిక అనంతపురం పట్టణ టీడీపీలో చిచ్చురేపింది. స్థానిక ఎమ్మెల్యే జయరాం నాయుడు, మేయర్ స్వరూప ఒక వర్గం కాగా, కార్పొరేటర్లు మరో వర్గంగా విడిపోయారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. ధనలక్ష్మి అనే కార్పొరేటర్ శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయగా దానిని ఉపసంహరించుకోవాలని మేయర్ స్వరూప ఒత్తిడి తెచ్చారు. విషయం తెలుసుకున్న జయరాంనాయుడు ధనలక్ష్మీ వద్దకు వెళ్లి వాగ్వివాదానికి దిగారు. ధనలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించకపోవటంతో అధికారులతో కూడా వాదులాట జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.