లక్ష తీసుకుంటూ దొరికి పోయాడు | Anti corruption Bureau cought warangal DPO | Sakshi
Sakshi News home page

లక్ష తీసుకుంటూ దొరికి పోయాడు

Nov 10 2015 3:39 PM | Updated on Aug 17 2018 12:56 PM

వరంగల్ డీపీవో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా.. ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మరో అవినీతి చేప ఏబీసీ వలలో చిక్కింది. వరంగల్ డీపీవో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా.. ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ ఉద్యోగం కోసం జిల్లా పంచాయితీ అధికారి సోమ్లా నాయక్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు నిందితుడిని పట్టుకున్నారు. సోమ్లా నాయక్ తో పాటు..  సీనియర్ అసిస్టెంట్ అలీ, అటెండర్ సారంగ పాణిలను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement