
ఖైదీల్లో పరివర్తన రావాలి
పలు నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సబ్ జైలులోని పరిసరాలు పరివర్తన వచ్చేలా ఉండాలని హిందూపురంలోని జిల్లా అదనపు జడ్జి డి.రాములు అన్నారు.
– జిల్లా అదనపు న్యాయమూర్తి రాములు
హిందూపురం అర్బన్ : పలు నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సబ్ జైలులోని పరిసరాలు పరివర్తన వచ్చేలా ఉండాలని హిందూపురంలోని జిల్లా అదనపు జడ్జి డి.రాములు అన్నారు. రూ.22 లక్షలతో పునరుద్ధరణ చేసిన హిందూపురం సబ్‌జైలును రాములుతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్‌జైలులో కల్పించిన వసతులను చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అదేవిధంగా సబ్‌జైలులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా జైళ్లశాఖాధికారి సుదర్శనరావు మాట్లాడుతూ నెలాఖరులో పెనుకొండ సబ్‌జైలు ఆవరణలో ఖైదీలే నిర్వహణ సాగించేలా హిందూస్తాన్ పెట్రోలియం సౌజన్యంతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ విశ్వనాథ్, హిందూపురం సబ్‌జైలర్ వాసుదేవరెడ్డి, ఇతర సబ్‌జైలర్లు శ్రీనివాసులు, మల్లికార్జున, హరవర్దన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్, న్యాయవాది కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.