సాతులూరు (నాదెండ్ల): పాము కాటుకు గురై చికిత్స పొందుతూ ఓ యువకుడు మతి చెందిన సంఘటన మండలంలోని సాతులూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
పాముకాటుకు గురై యువకుడి మృతి
Oct 10 2016 9:38 PM | Updated on Sep 28 2018 3:41 PM
సాతులూరు (నాదెండ్ల): పాము కాటుకు గురై చికిత్స పొందుతూ ఓ యువకుడు మతి చెందిన సంఘటన మండలంలోని సాతులూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పస్తం రెడ్డయ్య (18) గత వారం చందవరం రక్షిత మంచినీటి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టే సమయంలో పాముకాటుకు గురయ్యాడు. రెడ్డయ్యను నరసరావుపేట ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు.
Advertisement


