ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు.
- హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు
- 28న ఏ కేటగిరీ, 29న బీ కేటగిరీ సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని బీ-కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి 371డీ రాష్ర్టపతి ఉత్తర్వు వర్తించదని, ఈమేరకు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. యూనివర్సిటీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌లో బీ-కేటగిరీ సీట్లకు 371డీ ప్రకారం తెలంగాణ, ఏపీ అభ్యర్థులకు కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు సీట్లు కేటాయించారంటూ వస్తున్న ఆరోపణలు సరికావన్నారు.
నీట్ ర్యాంకుల ఆధారంగా బీ-కేటగిరీ సీట్లను దేశవ్యాప్తంగా కేటాయించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పుఇచ్చిందన్నారు. కాగా, ఈనెల 28న ఏ-కేటగిరీ కన్వీనర్ సీట్లకు, 29న బీ-కేటగిరీ (ప్రైవేటు యాజమాన్య) సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా, చిత్తూరు ఆర్‌వీఎస్ మెడికల్ కళాశాలకు కూడా అనుమతి వచ్చిందని, దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌లో 75 సీట్లు ఏ-కేటగిరీలో అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు.